నడకతో ఆరోగ్యం పదిలం కొత్త స్నేహలకు మార్గం

ప్రముఖ అడ్వకేట్ సంఘ గౌరవ అధ్యక్షులు భువనగిరిరవీంద్రగుప్తా

మహబూబాబాద్ :

నడక ప్రతి మనిషి ఆరోగ్యంగాన్నీ పదిలంగ ఉండడానికి కారణమే కాకుండా, కొత్త స్నేహాలతో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రముఖ అడ్వకేట్ సంఘ గౌరవ అధ్యక్షులు భువనగిరిరవీంద్రగుప్తా అన్నారు.
  ఉషోదయ వాకర్స అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం మానుకోట శివారు మామిడి తోటలో సంఘం అధ్యక్షుడు పాలబిందెల మల్లయ్య అధ్యక్షత వహించగా సంఘ ప్రధాన కార్యదర్శి ఆకుల శoబయ్య కార్యదర్శి నివేదిక,మహిపాల్ రెడ్డి ఆర్థిక నివేదిక ప్రవేశపెట్టగా, ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది, అసోసియేషన్ గౌరవ సలహాదారులు భువనగిరి రవీంద్ర గుప్తా మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా మహబాద్ పట్టణంలో విబిన్న రంగాలకు చెందిన వ్యక్తులు జూనియర్ కళాశాలలో వాకింగ్ చేయడం వలన ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి, నేడు వేలాదిమందికి వాకింగ్ ఆరోగ్యానికి ప్రధమ ఔషధమని భావించడం వలన పలు వాకింగ్ అసోసియేషన్స్ ఏర్పడి పరస్పర సహకారం తో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా అగ్రభాగంలో నిలుస్తున్నారని ఆరోగ్యవంతమైన సమాజానికి ఇలాంటి అసోసియేషన్లూ దిక్సూచిగా ఉంటాయని అన్నారు
బెస్ట్ వాకర్స్, సంఘం లో క్రియాశీలకంగా పనిచేసిన వారిని ఘనంగా సన్మానించారు
ఈ సమావేశంలో సంఘ బాధ్యులు ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, దాసరి ప్రసాద్, కళ్ళెం వెంకట్ రెడ్డి, కన్నా అశోక్ బాబు, కపరబోయిన శ్రీనివాస్, ఇమ్మడి కృష్ణ మూర్తి, నక్క .నాగార్జున, ముల్లంగి, సుంకర వెంకటేశ్వర్లు ముల్లంగి వెంకట్రె డ్డి, తీగల రాజేందర్, మార్కండేయులు, కుమార్, తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *