ఈ నెల 24 నుండి 28 వరకు మెదక్ జిల్లా మనోహరాబాద్ లో జరిగే పదవ తెలంగాణ అంతర్రాష్ట్ర సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు మహబూబాబాద్ మండలo పర్వతగిరి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఏ.సంధ్య, బి సింధు,జి.కావ్య, జి సంతోష్,జె.మంజునాథ్, జి.రిత్విక్, ఆర్. వెంకటేష్ లు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందుల శ్రీరాములు తెలిపారు. కాగా ఈ నెల 19న మహబూబాబాద్ లో జరిగిన జిల్లా సెలక్షన్స్ నందు అత్యంత ప్రతిభ కనబరిచి వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు రవి, కృష్ణ, ఉమారాణి, శ్రీలత, నాగవర్ధన్ మరియు ఫిజికల్ డైరెక్టర్ అవారి శ్రీనివాస్ అభినందించారు.
రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు పర్వతగిరి విద్యార్థులు
22
Dec