మహబూబాబాద్ :
మహబూబాబాద్ పట్టణానికి చెందిన సంకెపల్లి సాయి నాథ్ రెడ్డి ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL క్రికెట్ టోర్నమెంట్ లో రాజస్థాన్ రాయల్ టీం సూపర్ సెలెక్టర్ హాకథాన్ లో విజేతగా భారతదేశం స్థాయిలో 8 వేల మంది పోటీ పడగ ముంబై లో జరిగిన స్క్రీనింగ్ లో 16 మంది అందులో నుండి తరువాత దశ లో 8మంది ఆ తరువాత దశ లో 3ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. ఆ ముగ్గురిలో ఒకడిగా మన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాయినాథ్ రెడ్డి ఉండటం విశేషం. వీరు UAE లోని అబుదాబి లో జరిగిన IPL ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కోచ్ సంగక్కర గారికి మరియు డైరెక్టర్ ఆఫ్ స్రాటజీ జైల్స్ గారికి క్రీడాకారులకు సంబంధించిన మరియు ఇతర వివరాలను ప్రజెంటేషన్ ద్వారా వారికి తగిన ఫీడ్బ్యాక్ ను ఈ సందర్భంగా ఇచ్చారు. సాయి నాథ్ రెడ్డి మహా బూబా బాద్ పట్టణము కు చెందిన ప్రముఖ అసిస్టెంట్ ప్రొఫసర్ (ప్రైవేట్ )ప్రముఖ ప్రభుత్వ ఉపాధ్యాయు రాలు సంకెపల్లి శ్రీనివాస రెడ్డి -కీర్త నా రెడ్డి దంపతుల ప్రధమ కుమారుడు, ప్రస్తుతము సాయినాథ్ రెడ్డి బెంగుళూరు లో డేటా సైంటిస్ట్ గా ఉద్యోగము చేస్తున్నాడు. ఈ సందర్బంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళీ నాయక్, ఏ ఆర్ డి యస్ పి విజయ ప్రతాప్, క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి, మరియు ప్రముఖ పిల్లల వైద్యులు బొడ్ల మధుసూదన్ రావు లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కోచ్ మెతుకు కుమార్ మరియు మైబాద్ ప్రాంత క్రికెట్ క్రీడాకారులు క్రీడాభిమానులు హర్షం ప్రకటించారు. అభినందనలు తెలిపారు ఇతర అనేక సంస్థ ల ప్రతినిధులు సాయి నాథ్ రెడ్డి కి అభినందనలు తెలుపుతూ మానుకోట వాసికి ఐపీఎల్ లోనే ఒక ప్రధానమైన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి టెక్నికల్ వింగ్లో ఈ రకమైన తోడ్పాటు అందించడం ఇంత ఆరుదైన స్థానము లభించటము పట్ల సంతోషము వ్యక్తము చేశారు.