కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన తుంపిల్ల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నియమించింది. ఈ పదవి లో మూడేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగుతారు. తెలంగాణ హైకోర్టు అన్ని జిల్లాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం తరఫున కేసులను ఆయా కోర్టులలో వాదించేందుకు స్టాండింగ్ మరియు అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్స్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా మహబూబాబాద్ జిల్లాకు గాను స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిల్ గా తుంపిల్ల శ్రీనివాస్, అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ గా యెడ్లపల్లి బృందాధరరావు, నలుసాని ప్రభాకర్ రెడ్డిలను నియమించారు. న్యాయవాది తుంపిల్ల శ్రీనివాస్ గత 20 సంవత్సరాలుగా పలు సివిల్ క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి కృషి చేశారు. గతంలో కూడా అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. తెలంగాణ సాధన ఉద్యమంలో క్రియశీలకంగా పాల్గొని, అణగారిన వర్గాల ప్రజలకు ఉండగా న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూనే రాజకీయపరంగా వాళ్ళ హక్కులను కాపాడుట కోసం తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయపరమైన ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యార్థి దశ లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో చురుకుగా పాల్గొన్నారు. నల సాని ప్రభాకర్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీ మరియు న్యాయవాదిగా భారత్ వికాస్ పరిషత్ లో గత 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వారి సేవలను గుర్తించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా నియమించారు. ఈ నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు,కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గోకుల్ రామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఒద్దిరాజు రామచంద్రరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వల్లభు వెంకటేశ్వర్లు కు వారు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా తుంపిల్ల శ్రీనివాస్• అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్స్ గా యెడ్లపల్లి బృందాధరరావు, నలుసాని ప్రభాకర్ రెడ్డి నియామకం
24
Dec