అందరి సహకారంతో రైల్వే ప్రాజెక్ట్ సాదించుకుందాం : ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి

ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం మహబూబాబాద్ లో రైల్వే భూసేకరణ కు లేఖ అందజేయడం పట్ల హైదరాబాద్ సెక్రటేరియట్ లో అభినందనలు తెలిపిన మహబూబాబాద్ రైల్వే ప్రాజెక్ట్ సాదన కమిటీ, అఖిలపక్ష పార్టీలు , వ్యాపార వర్గాలు

పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్, డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విఫ్ డాక్టర్ రాంచంద్రు నాయక్, మాజీ యంపి సీతారాం నాయక్, తదితరులు.

మహబూబాబాద్, మున్సిపల్ అనంతారం దగ్గరే రైల్వే మెగా మౄయింటనెన్స్ ప్రాజెక్ట్ కోసం 400 ఎకరాల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం రైల్వే శాఖకు లేఖ పంపిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని, ప్రాజెక్ట్ శంఖుస్థాపన అయ్యేవరకు అందరి సహకారంతోనే ముందుకెళ్దామని తెలిపారు. రాజకీయాలకతీతంగా మహబూబాబాద్ అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకెళ్దామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *