మహబూబాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కళ్యాణి
మహాతెలంగాణ/ మహబూబాబాద్:
గత సంవత్సరంలో లాగే 2026 లో కూడా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో జీరో యాక్సిడెంట్ డిపోగా పేరు నమోదయాల డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిపో మేనేజర్ కళ్యాణి సూచించారు. జాతీయ భద్రత మాసోత్సవాల కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాల మేరకు మహబూబాబాద్ డిపోలో డిపో మేనేజర్ వి కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. విశిష్ట అతిథులు ఏ ఎం విఐ వెంకట్ రెడ్డి, సాయి చరణ్ మహబూబాబాద్ చేతుల మీదుగా మహబూబాబాద్ డిపో నందు గత 20 సంవత్సరాలకు పైగా ఎటువంటి యాక్సిడెంట్ చేయని డ్రైవర్ సోదరులను సన్మానించి మరియు డ్రైవర్లు పాటించవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మరియు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కళ్యాణి మాట్లాడుతూ మహబూబాద్ డిపో జీరో ఆక్సిడెంట్ డిపో గా 2025 సంవత్సరంలో నమోదు కాగా అదేవిధంగా 2026 సంవత్సరంలో కూడా ఎటువంటి యాక్సిడెంట్లు చేయకుండా డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేయవలెనని సెల్ఫోన్ డ్రైవింగ్ చేయరాదని మరియు ఎదురుగా వచ్చు వాహనాలను ముందుగానే చూసుకొని జాగ్రత్త డ్రైవింగ్ చేయాలని సూచించారు. ప్రయాణికుల క్షేమమే మన యొక్క ధ్యేయమని, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చడమే మన లక్ష్యంగా డ్రైవర్లు పనిచేయాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపర్డెంట్ శ్రీమన్నారాయణ, ఎం.ఎఫ్ పాపిరెడ్డి, ఎడిసిలు మరియు ఆఫీస్ సిబ్బంది , సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.