రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్

మహబూబాబాద్ :

గురువారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కలెక్టరేట్ లోని తన చాంబర్ లో రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 1, 2026 నుండి జనవరి 31, 2026 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు – 2026 నిర్వహించనున్నట్లు దీని యొక్క నేపథ్యం సీక్ సే సురక్ష టెక్నాలజీ సే పరివర్తన అని అందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. రోడ్డు భద్రత వారోత్స కరపత్రాలను పంచడం బ్యానర్లను ఏర్పాటు చేయడం వాటిని జిల్లా కలెక్టర్ ఎస్పీ గార్ల చేతుల మీదుగా విడుదల చేయడం రోడ్డు భద్రత ప్రతిజ్ఞను చేయించడం జరుగుతుందని, పాఠశాల కూడళ్ళలో బ్యానర్లను పోస్టర్లను అంటించడం సీట్ బెల్ట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, హెల్మెట్ ధరించడం దీనికి సంబంధించి పాఠశాల, కాలేజీల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించడం కరపత్రాలను పంపిణీ చేయడం ఉల్లంఘించిన వారిపై చర్యలపై అవగాహన కల్పించడం 01.01.2026 నుండి 03.01.2026 వరకు జరుగుతుందని అన్నారు. డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించడం, స్కూల్ బస్సుల భద్రతను పరీక్షించడం, విద్యార్ధులచే వ్యాసరచన క్విజ్ పోటీలు వేగ నియంత్రణ మీద తనిఖీలు బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని, పాదాచారుల భద్రత గురించి అవగాహన కల్పించడం పోలీసు రవాణా మరియు ఆర్ అండ్ బి అధికారులచే 04.01.2026 నుండి10.01. 2026 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అధికలోడు మరియు అధిక ప్రయాణికులతో వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేయడం NSS/NCC వాలంటీర్ల ను ర్యాలీలో పాల్గొని టాక్సీ, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత ప్రయాణికుల భద్రత గురించి అవగాహన కల్పించడం ముగ్గుల పోటీలు నిర్వహించడం జిల్లాలో ఉన్న గ్రామాల్లో ఉత్తమ రోడ్డు భద్రతను పాటిస్తున్న ఒక గ్రామాన్ని ఎన్నుకోవడం సినిమా హాల్లో ప్రదర్శనలు చేయడం వాహనాల ఫిట్నెస్ మరియు పొల్యూషన్ పత్రాలను తనిఖీలు చేయడం 11.1.2026 నుండి 17. 1. 2026 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులచే పెయింటింగ్ పోటీలను నిర్వహించడం ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతలను అవగాహన కల్పించడం ప్రతి ఆర్టీవో ఆఫీస్ లో 15 నిమిషాలు ఆడియో మెసేజ్ ద్వారా రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం పాఠశాలల్లో వర్క్ షాప్స్ నాటకాల ద్వారా అవగాహన సైకిల్ ర్యాలీలు, ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా పర్యావరణ భద్రతతో రోడ్డు భద్రత నిర్వహించడం జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ద్వారా బ్లాక్ స్పాట్లను సరి చేయడం బస్టాండు ఆటో స్టాండ్లలో కరపత్రాలను పంపిణీ చేయడం పిల్లలచే రోడ్డు భద్రత గురించి ఆటపాటల తో అవగాహన కల్పించడం 18.1.26 నుండి 24.1.26 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజా రవాణా భద్రత గురించి వాటికి సంబంధించిన ఆప్స్ గురించి ప్రమాదాలకు ప్రతి స్పందించడం రేడియం స్టిక్కర్స్ గురించి అవి లేని భారీ వాహనాల మీద తనిఖీలు ప్రథమ చికిత్స అత్యవసర ప్రమాదాలకు ప్రతిస్పందించడం వైద్యశాఖ, రెడ్ క్రాస్ వారిని భాగస్వాములను చేయడం మీడియా ద్వారా అవగాహన కల్పించడం నివేదికలను మీడియా ద్వారా తెలియపరచడం 25.1. 26 నుండి 30.1. 26 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 31.1.26 ఉత్తమ అధికారులను, వాలంటీర్లను, పాఠశాలలకు, డ్రైవర్లకు అవార్డులు పంపిణీ నెలవారి నివేదికలను జరిగిన కార్యక్రమాలను తెలియజేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీవో జైపాల్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సాయిచరణ్, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *