సిపిఎం భూ పోరాట కేంద్రానికి సీతారాం ఏచూరి పేరు నామకరణ
సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
మహబూబాబాద్ :
ప్రపంచం గర్వించదగ్గ ఉద్యమ నేత కమ్యూనిస్టు నాయకుడు సీతారాం ఏచూరి అన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ గారు అన్నారు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని కురవి రోడ్డులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, నిరుపేదలు వేసుకున్నటువంటి భూ పోరాట కేంద్రానికి సిపిఎం పార్టీ, జాతీయ మాజీ కార్యదర్శి సీతారాం ఏచూరి గారి పేరు ఈరోజు పెట్టడం జరిగింది, ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధులు శ్రీనివాస్ గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశం గర్వపడే నేత సీతారాం ఏచూరి గారు అలాంటి మహనీయుని పేరు, ఎన్నో త్యాగాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి, ఈ కాలనీకి అలాంటి త్యాగనీయుని పేరు పెట్టుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు, ఈ భూ పోరాట కేంద్రం నాడు రజాకార్ల మీద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎలా అయితే నిర్వహించారో, అదే స్ఫూర్తి తోటి భూ బకాసురులు, భూ కబ్జాదారుల నుండి, ఎర్ర జెండా పక్షాన, పేద బడుగు బలహీన వర్గాలు, పోరాటాలను నిర్వహించి, ఉద్యమ ఊపిరిగా పోరాటాలు సాధించుకోవడం జరిగిందని, ఎన్ని నిర్బంధాలు చేసిన, కబ్జాదారుల నుంచి, ప్రభుత్వం నుండి, నిర్బంధాలు, ఎదురోడి నిలిచి మనం నైతిక విజయం సాధించామని, సాధుల శ్రీనివాస్ గారు అన్నారు, మనము ఈరోజు, గొప్ప కమ్యూనిస్టు నేత, త్యాగశీలి, విద్యావేత్త అయినటువంటి, సీతారాం ఏచూరి గారి, పేరు మన కాలనీకి నామకరణం చేసుకుంటానంటే, మనం ఎంతో గర్వించవలసిన విషయం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్వీణ్యం చేయడం కోసం, ఇండియన్ కూటమి లో ప్రధాన బాధ్యత వహిస్తూ దేశంలో 400 సీట్లు సాధిస్తానని పగటి బాలు బంధిన మోడీ నడ్డి విరించి ఇద్దరు రెండు రాష్ట్రాలలో కాళ్లు పట్టుకొని దేశంలో అధికారం కి రావడానికి దిగజారడానికి ముఖ్యపాత్ర వహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి దేశంలో ఇండియా కూటమి గణనీయమైన స్థానాల్లో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి ప్రపంచం మొత్తం సీతారాం ఏచూరి గారి ఉపన్యాసానికి ముద్దుల పేద బడవు బలహీన వర్గాల ప్రజానీకం కోసం ప్రతినిత్యం అన్వేషించిన మహనీయుని పేరు మన కాలనీ పెట్టుకోవడం గర్వకారణం అని అన్నారు కావున మన కాలనీ సీతారాం ఏచూరి గారి కాలనీని ఆదర్శనీయమైన కమ్యూనిస్టు ఉద్యమానికి, కేంద్రంగా ఉండాలని పిలుపునిచ్చారు,
రాబోయే రోజుల్లో ఇండ్లు లేని నీరు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి పట్టాలు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పై మరింత పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు
లేని వెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ భూములను గుర్తించి ఇండ్లు లేని నీరు పేదలకు ఇండ్లు వేపించి ఇంటి జాగా దక్కెవరకు పోరాటాలు చేస్తామని డిమాండ్ చేసారు…
ఈ కార్యక్రమంలో, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య, గుడిగంటి రాజన్న, ఆకుల రాజు, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు రావుల రాజు, చీపిరి యాకన్న, చాగంటి భాగ్యమ్మ ఎండి రజాక్, యమగాని వెంకన్న, ఎర్ర శ్రీనివాస్, బానోత్ వెంకన్న, గౌని వెంకన్న, వీరిని సుధాకర్, లాలయ్య,
శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు