ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎంను గెలిపించండి – పట్టణ అభివృద్ధికి తోడ్పడండి

కార్యకర్తలు సైనికుల పనిచేయాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని, అందుకోసం కార్యకర్తలు సైనికుల పనిచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఆర్తి గార్డెన్లో పట్టణ కార్యదర్శి భానోత్ సీతారాం నాయక్ అధ్యక్షతన జరిగిన విస్తృత సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలు ఎజెండా మీదకు రావాలన్నా అవి పరిష్కారం జరగాలంటే సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఉందని అన్నారు.
ప్రధానంగా కోతులు, కుక్కల సమస్యలు, వీధి దీపాలు, సైడ్ డ్రైనేజీ ,రోడ్లు రైల్వే ప్లాట్ఫారం తో పాటు మంచినీరు, మురికి కాలువలు తదితర పట్టణ సమస్యలపై నిర్విరామమైన పోరాటాలు చేసిన పార్టీ సిపిఎం అని తెలిపారు. అలాంటి పోరాటాలు చేస్తున్న వారికి ఓటు ద్వారా అధికారం ఇస్తే మరిన్ని సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పేదల సమస్యలను పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్ల కోసమే పనిచేస్తుందని తెలిపారు. పేదలకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం కుట్రలు పన్నుతుందని దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ బిల్లు పెంచి విద్యుత్తును మొత్తం కార్పొరేట్ల పరం చేస్తుందని విమర్శించారు. కార్మికులను కట్టు బానిసలు చేయడం కోసం కార్మిక చట్టాల స్థానంలో కోడ్లను తీసుకుని వచ్చిందని దానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న పెద్ద ఎత్తున ప్రజలు సమ్మెకు పిలుపు ఇచ్చారని అన్నారు. పేద మధ్యతరగతి వర్గం ధరల పెరుగుదలతో అనేక రకాల ఇబ్బందులకు గురవుతుందని, దాన్ని పట్టించుకునే స్థితిలో మోడీ ప్రభుత్వం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 100 వాగ్దానాలు చేసిందని వాటి అమలు చేయడంలో వెనుకబడిందని తక్షణం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో వెనుకబడ్డ మహబూబాబాద్ ను అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక శ్రద్ధను పెట్టాలని ప్రధానంగా రైల్వే ఫ్యాక్టరీని ఏర్పాటుకు కృషి చేయాలని సాగునీరు తాగునీరు అందివ్వాలని రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీ అభ్యర్థులనే ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు.

ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య, ఆకుల రాజు, జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు రావుల రాజు చిపిరి యాకయ్య కుమ్మరి కుంట్ల నాగన్న చాగంటి భాగ్యమ్మ బానోత్ వెంకన్న హేమ నాయక్ తోట శ్రీనివాస్ ఎర్ర శ్రీను గౌని వెంకన్న MD రజాక్ యామగాని వెంకన్న పులి గుజ్జు వెంకన్న లాలయ్య శాఖ కార్యదర్శి లు పార్టీ సభ్యులు పాల్గున్నారు…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *