వికాస్ ఇందిర విద్యాసంస్థలలో ఘనంగా 2026 సంక్రాంతి సంబరాలు

మహబూబాబాద్ :

సంక్రాంతి పండుగ సంబరాలు పురస్కరించుకొని స్థానిక మహబూబాబాద్ పట్టణంలోని బొడ్రాయి సెంటర్లో గల వికాస్ ఇందిర విద్యా సంస్థ లలోసంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల కరస్పాండెంట్ బిక్కి వెంకటేశ్వర్లు గారు హాజరయ్యి ముగ్గుల పోటీలను ప్రారంభించారు. అలాగే భోగి మంటలు కార్యక్రమాన్ని ఇందిర విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీముఖి ప్రారంభించడం జరిగింది ఈ భోగిమంటల కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులు సంతోషంతో డ్యాన్సులు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదనంతరం కరస్పెండెంట్ గారు మాట్లాడుతూ సంక్రాతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగల లో ఒకటని సంక్రాంతి సూర్యుడు మకరంలోకి మారడాన్ని జరుపుకునే ఒక ముఖ్యమైన భారతీయ పండుగని ఇది శీతాకాలం ముగింపును సూచిస్తూ అన్ని పంటలు చేతికి వచ్చిన సందర్భంగా నువ్వులు, బెల్లం, బియ్యంతో స్వీట్లు చేసుకొని పంచుకుని ఐక్యతతో ప్రకృతితో మమేకం కావడమే ఈ పండుగ యొక్క ప్రత్యేకత అని తెలియజేశారు. తరువాత కళాశాల ప్రిన్సిపాల్ జి వీరయ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలలోని పాల్గొనిన వారిలో విజేతలను ప్రకటించి వారికి బహుమతులను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రామరాజు గారి సహకారంతో ప్రైజ్ మనీని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సాంప్రదాయబద్ధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరికీ శుభాలు జరగాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్. రాజు, ఎం. రవీందర్, బి. నరేష్, ఎం. వెంకటేశ్వర్లు, ఏ. మధు, రఘు, వీ .రమేష్, వి. నాగరాజు, ఏ. సునీత, జి. రాజేశ్వరి, లక్ష్మీ ప్రసన్న, పద్మావతి, రేవతి ,అంజలి, మాధవి, బిక్షపతి, సారంగం, యాకన్న పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *