వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి

ప్రజలకు ఉపాధి,పంచాయతీలకు పాలన హక్కులు కల్పించాలి

మహబూబాబాద్ డిసిసి అధ్యక్షురాలు డా ఉమా మురళి నాయక్
మహబూబాబాద్ :
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిసి అధ్యక్షురాలు డా ఉమా మురళి నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను కలరాస్తూ గ్రామపంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారలను నిర్వీర్వం చేసింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం mgnregs స్థానంలో తీసుకొచ్చిన వికసిద్భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ చట్టం ( వీబీజీ రామ్ జీ ) గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పేద ప్రజల పైన ప్రమాదకరమైన విధమైన మార్పుల ను పూర్తిగా తిప్పి కొట్టాలని అన్నారు…

అంతే కాకుండా బీజేపీ కేంద్రంలో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల పేద ప్రజలు ఉపాధిని కోల్పోతారని అంతేకాకుండా నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతుంది.మరియు దినసరి కూలీలకు కనీస వేతనాల కన్నా తక్కువ వేతనాలు చెల్లించి దోపిడి చేస్తారని దీనివల్ల ముఖ్యంగా మహిళలు ఉపాధి అవకాశాలు కోల్పోతారని దళిత ఆదివాసి గిరిజనుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని రానున్న రోజుల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగి గ్రామీణ జీవన ప్రమాణాలు కూలిపోతాయని అంతే కాకుండా గ్రామంలో నిర్మించే ఆస్తులపైన ప్రజల హక్కులు కోల్పోతారని ప్రజల ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు పనులు గ్రామసభ నిర్ణయం పై కాకుండా ఢిల్లీ నిర్ణయం పై ఆధారపడి ఉంటాయని తాత చట్టంలో గ్రామసభలు పంచాయతీ పనులు వాటిక అయ్యే ఖర్చులను గ్రామ పరిధిలోనే నిర్ణయించేవి కానీ ఇకపై పనులు నిధులను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది…

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు డా ఉమా మురళి నాయక్ వెంట మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళి నాయక్, మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మీర సురేష్, అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు సాయి పట్టణ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య ,పట్టణ నాయకులు ,ఖలీల్ , ఎడ్ల రమేష్ ,పద్మం ప్రవీణ్, దిలీప్, పట్టణ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *