మహబూబాబాద్ అభివృద్ధికి సహకరిస్తా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ

మహబూబాబాద్ :

మహబూబాబాద్ రైల్వే మెగా ఫ్రెయిట్ మెయిన్టేనేన్స్ డిపో సాధన కమిటీ బాధ్యులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్రమంత్రివర్యులు బొగ్గు, ఉక్కు గనుల శాఖ మాత్యులు శ్రీ గంగవరపు కిషన్ రెడ్డి గారిని కలిసి మహబూబాబాద్ లోనే రైల్వే మెగా ఫ్రెయిట్ మైంటెనెన్సు డిపో ను ఏర్పాటు చేయుటకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు లభించేలా సహకరించాలని మంత్రి గారిని కోరగా… చాలా సానుకూలంగా స్పందిస్తూ.. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని, వెనుకబడిన జిల్లాల అభివృద్దె లక్షంగా పనిచేస్తామని తెలిపారు. కేంద్ర స్థాయిలో సంబంధిత శాఖ మంత్రి గారిని కలిసి అనుమతులు వచ్చేలా చూస్తానని అన్నారు
దశబ్దాల కాలంపాటు వెనుకబడి గిరిజన జిల్లాగ ఉండి ఎటువంటి పరిశ్రమలు లేక నిరుద్యోగులుఅధికంగా ఉన్న జిల్లా ను అభివృద్ధి చేయాలనీ, రైల్వే డిపో ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 409 ఎకరాల భూసేకరణ చేసి ఉచితంగా ఇవ్వడానికి అంగీకరిస్తూ దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ గారికి లేఖ ఇవ్వడం జరిగినదని మంత్రి గారి దృష్టికి తీసుకు పోవడం జరిగినది.
ఈ కార్యక్రమం లో హన్మకొండ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు, డిపో సాధన కమిటీ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణ, కో ఆర్డినేటర్ మైస శ్రీనివాసులు, BJP జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు, MRPS జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య,BJP జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, గిరిజన మోర్చా నాయకుడు ప్రభాస్ నాయక్, BJP మీడియా ఇంచార్జ్ బానోత్ సురేందర్, TP JAC నాయకులు సోమ విష్ణువర్ధన్, SK. జానీ, ఆవుల యుగేందర్, అక్రమ్, బిజెపిపట్టణ నాయకులు శ్యామ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *