మహాతెలంగాణ/మహబూబాబాద్: వరంగల్ మరియు మహబూబాబాద్ జిల్లాలలోని సుమారుగా 10 పోస్ట్ ఆఫీసులలో (వరంగల్ , మహబూబాబాద్ ,నర్సంపేట , నెక్కొండ, దేశాయిపేట్, కేసముద్రం, డోర్నకల్, కురవి , తొర్రూర్ మరియు మరిపెడ) ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయబడి సేవలు అందించబడుతున్నాయి. ఈ ఆధార్ కేంద్రాలలో కొత్త ఆధార్ నమోదు మరియు ఉన్న ఆధార్ లో సవరణలకు (ఫోటో ,బయోమెట్రిక్ , చిరునామా మార్పు, ఫోన్ నంబర్ లింక్) సంబందించిన సేవలు అందించబడుతున్నాయి. ఈ ఆధార్ కేంద్రాలలో 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా ఆధార్ నమోదు చేయబడును. ఉమ్మడి జిల్లాలలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధార్ సేవలను సులభంగా పొందాలని బి రవి కుమార్ వరంగల్ పోస్టల్ సూపరింటెండెంట్ కోరినారు.
పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ సేవలు
03
Feb