మహబూబాబాద్ :
గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశీరాం నాయక్ గారి చేతుల మీదుగా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల మహబూబాబాద్ విద్యార్థినులకు స్టడీ మెటీరియల్ మరియు నైట్ డ్రెస్ లు పంపిణీ చేయడం జరిగింది.* మంగళవారం పాఠశాల అసెంబ్లీలో పాల్గొన్న అనంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ కమిషనర్ – గిరిజన సంక్షేమ శాఖ ద్వార అన్ని సౌకర్యాలు విద్యార్థిని విద్యార్థులకు అందిస్తున్నామని, అలాగే పరీక్షలకు సిద్ధంగా ఉండాలనీ 100% ఫలితాలని సాధించాలని అన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ATDO ఉపేందర్, DRP శ్రీకాంత్, పాఠశాల HM నర్సయ్య మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.