ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు

మహబూబాబాద్ :

జిల్లాలో పదవ తరగతి (SSC) వార్షిక పరీక్షలు ఈరోజు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి V. రాజేశ్వర్ తెలిపారు. జిల్లాలోని 45 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో రెగ్యులర్ 8147 మంది విద్యార్థులు అలాట్మెంట్ కాగా 8141 మంది విద్యార్థులు హాజరయ్యారు 06 మంది విద్యార్థులు గై హాజరయ్యారు (ప్రైవేట్ ) వన్స్ ఫెయిల్డ్ లో 04 మంది విద్యార్థులు అలాట్మెంట్ కాగా 03 మంది విద్యార్థులు హాజరయ్యారు ఒక్కరు గై హాజరయ్యారు

పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రశ్నాపత్రాల భద్రత మరియు పరీక్షల నిర్వహణలో పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కేంద్రాల వద్ద పోలీస్ భద్రత, తాగునీరు, విద్యుత్ మరియు ప్రథమ చికిత్స వంటి ఏర్పాట్లు కూడా చేయబడ్డాయని వివరించారు.

పరీక్షా కేంద్రాలను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ మూడు టీములు 20 సెంటర్లను తనిఖీ చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారి వి. రాజేశ్వర్. 06 సెంటర్లను Acge మందుల శ్రీరాములు O5 సెంటర్లను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *