మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో సేవలందించిన హోంగార్డ్ ఉపేందర్ పదవీ విరమణ

ఉపేందర్ ని శాలువాతో ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్

మహబూబాబాద్:

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో దీర్ఘకాలంగా నిబద్ధతతో సేవలందించిన హోంగార్డ్ బి. ఉపేందర్ ఈరోజు పదవీ విరమణ పొందిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ IPS ఉపేందర్ ని శాలువాతో ఘనంగా సత్కరించి, పోలీస్ శాఖకు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, హోంగార్డులు పోలీస్ శాఖలో కీలక భాగమని, ప్రజా భద్రత, విధి నిర్వహణలో వారు అందించే సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. బి. ఉపేందర్ గారు తమ విధుల్లో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి సహచరులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్ గారు, ఆర్‌ఐ భాస్కర్ గారు పాల్గొని ఉపేందర్ గారి సేవలను కొనియాడారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో బి. ఉపేందర్ గారి కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ సందర్భంగా ఉపేందర్ గారు భావోద్వేగానికి గురై, తనకు సహకరించిన జిల్లా పోలీస్ శాఖ అధికారులకు మరియు సహచర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *