వరి కొయ్యలకు అంటుకున్న మంటలు
మహాతెలంగాణ/నర్సింహులపేట
నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో మందుల నరసయ్య మృతి చెందగా దహన సంస్కారాల కోసం గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. దహన సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలో గాలుల ప్రభావంతో సమీపంలోని పంట పొలాల్లో ఉన్న వరి కొయ్యలకు మంటలు అంటుకున్నాయి. దీంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకుగురయ్యారు. గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు వేసవి కాలంలో దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచించారు.