కేసముద్రం మున్సిపాలిటీ 15,16వ వార్డ్ ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్

మహా తెలంగాణ/కేసముద్రం

మహబూబాబాద్ జిల్లా SP శ్రీ శబరిష్. P, IPS గారి ఉత్తర్వుల ప్రకారం జిల్ల ను గంజాయి మరియు గుడుంబా రహితంగ మార్పు లో భాగంగా మహబూబాబాద్ DSP N.తిరుపతి రావు గారి ఆధ్వర్యంలో సీఐ కేసముద్రం Y. సత్యనారాయణ, సర్కిల్ SI లు క్రాంతి కిరణ్, కరుణాకర్, నరేష్ మరియు సర్కిల్ సిబ్బంది కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 15 మరియు 16 వ వార్డ్ లలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది, ఈరోజు సెర్చ్ లో ముఖ్యంగా గంజాయి త్రాగేవాళ్ళని, రవాణా చేసేవాళ్ళని, గుడుంబా తయారు చేసేవాళ్ళని, నల్ల బెల్లం అమ్మేవాళ్ళని టార్గెట్ చేసుకొని సెర్చ్ నిర్వహించడం జరిగింది, ఈరోజు సెర్చ్ లో
200 లీటర్ల గుడుంబా, 02 క్వింటల నల్లబెల్లం, 24 లీటర్ల IMFL మరియు 4000 లీటర్ల బెల్లం పానకం సీజ్ చేసి వాటిని తయారు చేస్తున వారిపై కేసు లు నమోదు చేయడం జరిగింది.
కేసముద్రం సర్కిల్ పరిధిలో లో గంజాయి మరియు గుడుంబా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మీ అక్రమర్జన కొరకు ఇతరులు ప్రాణాలను పణంగా పెడితే చూస్తూ ఊరుకునేది లేదని, గంజాయి కి సంబంధించిన సమాచారం 8712656999 నెంబర్ కి ఫోన్ చేసి తెలియ చేస్తే మీకు 5000 రూపాయలు బహుమతి ఇవ్వబడును మరియు మీవివరాలు గొప్యంగా ఉంచబడుతుందని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *