నిత్యవసర ధరల పెరుగుదలపై సిపిఐ సమరశంఖం

మహాతెలంగాణ/మహబూబాబాద్:

ఈ నెల 10న కలక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండిసిపిఐ రాష్ట్ర నమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్మహా తెలంగాణ /గార్ల ; నిత్యావసర ధరల పెరుగుదలపై సిపిఐ తలపెటిన్ద కలక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో సబ్బన్న వర్గాల ప్రజలు పాల్గోని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న అధ్యక్షత సోమవారంనాడు ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిదిగా పాల్గోన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఆకాశాన్ని అంటుతున్న ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 10వ తేదీన సిపిఐ పార్టీ ఆద్వర్యంలో జిల్లా కలక్టర్ కార్యాలయాల ముందు భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం, ఈ పోరాటం కేవలం ఒక పార్టీది కాదని, సామాన్య ప్రజలందరిది, కాబట్టి కలక్టరేట్ ముందు నిర్వహించే ఆందోలన కార్యక్రమానికి ప్రజలు, కార్మికులు, మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో పాల్గోని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహయ కార్యదర్శి రాగం రమేష్, భూక్య హరి నాయక్, ధూపాటి జనార్దన్,సింగు రమేష్, మాగం లోకేష్, రాజేష్, శ్రీను, తదితరులు పాల్గోన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *