మనఊరు-మనబడి బలోపేతం చేయాలి

జిల్లా విద్యాశాఖదికారి సత్యనారాయణ మూర్తి

మహాతెలంగాణ/మహబూబాబాద్

మనఊరు-మనబడి బలోపేతం చేయాలని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖదికారి సత్యనారాయణ మూర్తి అన్నారు. మంగళవారం జరిగిన బడిబాట కార్యక్రమంలో డిఈఓ తొర్రూరు మండలంలోని ఎంపి యుపిఎస్ చీకటాయపాలెం లో జరిగిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ మధ్యాహ్న భోజనం అల్పాహారం యూనిఫామ్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లాంటి సౌకర్యాలను వినియోగించుకొని మన ఊరు మనబడిని బలోపేతం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ బడులలో ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యతోపాటు సాంస్కృతిక మరియు క్రీడారంగాలలో కూడా విద్యార్థులలో దాగివున్న ప్రతిభను గుర్తించి వారిని అన్ని రంగాలలో తీర్చిదిద్దగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేటు పాఠశాలల నుండి 12 మంది విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ కల్పించి వారిని నమోదు చేసుకొని వారికి నోట్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల మొత్తానికి అందంగా రంగులు వేయించిన సర్పంచ్ కృష్ణమూర్తి గారిని సన్మానించారు. తదనంతరం తొర్రూర్ మండలంలోని గుర్తురు గ్రామంలో జరిగిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను తెలియజేస్తూ తల్లిదండ్రులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా విస్సంపల్లి గ్రామ సర్పంచ్ కవితా బాలకృష్ణ తన ఇద్దరు మనవరాలను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించినందుకు డీఈఓని సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, సిఎంఓ వంగ సురేష్ , ఏ ఎస్ సి సంతోష్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, తిరుమలేష్ ,అశోక్, రవీందర్, సీతారాం ప్రసాద్, గౌతమి ,వెంకట సత్యనారాయణ ,రాజ్ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *