గ్యాస్ (LPG) వినియోగదారులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేసుకోవాలి

మహబూబాబాద్/మహాతెలంగాణ :

భారత ప్రభుత్వం మరియు తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు గ్యాస్ (ఎల్పిజి ) వినియోగదారులు తమ e-KYC ప్రక్రియను 30 జూన్, 2026 లోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మహబూబాబాద్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ శ్రీ బోనగిరి ప్రసాద్ తెలిపారు.గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి ఇప్పటివరకు e-KYC పూర్తి చేయని వినియోగదారులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. e-KYC పూర్తి చేయని వినియోగదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మరియు సబ్సిడీ సౌకర్యాలలో అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు.వినియోగదారుల సౌకర్యార్థం మహబూబాబాద్ గ్యాస్ ఏజెన్సీలో ప్రత్యేక e-KYC కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు తమ ఆధార్ కార్డు మరియు నమోదు చేసిన మొబైల్ నంబర్‌తో ఏజెన్సీ కార్యాలయానికి వచ్చి e-KYC పూర్తి చేసుకోవచ్చని చెప్పారు.అదేవిధంగా, గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఏజెన్సీ డెలివరీ సిబ్బంది కూడా వినియోగదారుల వద్దకే వెళ్లి e-KYC ప్రక్రియను నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అన్ని గ్యాస్ వినియోగదారులు గడువులోపు e-KYC పూర్తి చేసి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నిరంతరంగా పొందాలని శ్రీ బోనగిరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *