యంగ్ ఇండియా ఆఫ్ ఎక్సలెన్స్ తో చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట

జి ఈ సి ఓ యద్దనపూడి గాయత్రి

మహాతెలంగాణ/నర్సింహులపేట:

ఆరవ తరగతి చదువుతున్న కేజీబీవీ విద్యార్థినులు యంగ్ ఇండియా ఆఫ్ ఎక్స్ లెన్స్ ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవచ్చని మహబూబాబాద్ జి ఈ సి ఓ యద్దనపూడి గాయత్రి సూచించారు.
జిల్లాలోని నర్సింహుల పేట కస్తూర్బా గాంధీ (కేజీబీవీ) పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పిజిసిఆర్టీలు, సిఆర్టి లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కసారి ఆరో తరగతిలో చేరితే మెడిసిన్, ఐఐటి, జేఈ ఈ, క్లాట్ ఎంట్రన్స్ లపై ప్రత్యేక అనుభవం కలిగిన ఎక్స్పర్ట్ లతో తరగతులు, ఆటలు, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, ఉచిత భోజనంతదితర సౌకర్యాలతో కూడిన హాస్టల్ వసతి కల్పిస్తూ ప్రభుత్వం 12వ తరగతి వరకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించిందని ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవడం వల్ల కేజీబీవీలో ఉన్నత చదువుకు ప్రభుత్వం అవకాశం కలిపిస్తుందనే సంకేతం విద్యార్థుల తల్లిదండ్రులకు చేరాలని అప్పుడే కేజీబీల్లో యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ లెన్సీ గురించి తెలుస్తుందని అన్నారు. చిన్నారుల్లో ఎంట్రన్స్ లో పోటీ తత్వాన్ని పెంచేలా 6వ తరగతి విద్యార్థులపై సీఆర్టీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆరవ తరగతి విద్యార్థులకు గణితం పై వివరిస్తూ ప్రశ్నించారు. అలాగే అకాడమిక్ అంశాలపై ఎస్ ఓ, సి ఆర్ టి లకు వివరించారు. చెలిమి ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. సిఆర్టి ల వార్షిక, యూనిట్, లెసన్ ప్లాన్ తనిఖీ చేశారు. పాఠశాలలో అన్ని రకాల రిజిస్టర్లు ఉండాలని, ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో పొందుపరుస్తూ ఉంచాలని సూచించారు. వంటగది, స్టాక్ రూమ్ పరిశీలించి విద్యార్థులకు మెనూ తప్పక పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ స్వప్న, పిజిసిఆర్టి లు, సి ఆర్ టి లు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *