ఏడుగురు నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్
మహబూబాబాద్ :
మహబూబాబాద్ రూరల్ పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన పిట్టల యాకయ్య హత్య కేసు http://Cr.No.167/2026, U/S 103(1) r/w 3(5) BNS. శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు మరియు దర్యాప్తు ద్వారా పోలీసులు కేసును ఛేదించారు. 30-06-2026 అర్ధరాత్రి నుండి 01-07-2026 తెల్లవారుజాము మధ్య నిందితులు సింగారం గ్రామంలోని మృతుడి ఇంట్లోకి ప్రవేశించి, ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న పిట్టల యాకయ్యపై ఇనుప రాడ్ తో దాడి చేసి హత్య చేశారు. మృతుడి భార్య పిట్టల యశోద W/O యాకయ్య, వయసు 53, R/O సింగారం (A-1) కు మృతుడిపై అక్రమ సంబంధాల అనుమానం ఉండేది. దీనితో ఆమె గంగుల కృష్ణ @ కృష్ణయ్య S/O ముత్తయ్య (A-2), నీలకురి మోహన్ రెడ్డి (A-3), తుమ్మిడి నర్మమ్మ (A-4) లతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఈ కుట్రలో భాగంగా కృష్ణమూర్తి (A-7) ద్వారా గంగరబోయిన వెంకన్న (A-5) మరియు సుము శివ (A-6) లను హత్య చేయడానికి నియమించారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు, మొబైల్ ఫోన్ కాల్ డేటా, CCTV వివరాలు మరియు నిందితుల విచారణ ఆధారంగా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. చివర్లో నిందితుల వద్ద నుండి కొన్ని వస్తువులను హత్యకు ఉపయోగించిన ఒక ఇనుప రాడ్, నేరం మరియు పరస్పర సమాచారానికి ఉపయోగించిన 7 మొబైల్ ఫోన్లు, నేరం చేయడానికి మరియు పారిపోవడానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లు, బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ హత్య కేసును త్వరగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందాన్ని మహబూబాబాద్ జిల్లా SP గారు అభినందించారు. ఆ బృందంలో DSP: N. తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ CI N. అంజలి, SI లు P. రాజు, K. రవికిరణ్ – రూరల్, B. సతీష్ – కురవి, సిబ్బంది వెంకటరమణ, బాలరాజు, సురేష్, మహేష్, మధు, లింగారావు, ఉమ, సౌదాని ఉన్నారు.