జన జాగరణ యాత్ర గోడ పత్రికఆవిష్కరణ

మహా తెలంగాణ/మహబూబాబాద్ :

మాధవపురం ఉన్నత పాఠశాలలో టి ఎస్ సి పి ఎస్ ఈ యు మహబూబాద్ మండల అధ్యక్షులు ధారావత్ వీరన్న గారి అధ్యక్షతన జన జాగరణ యాత్ర గోడ పత్రిక భోజన విరామ సమయంలో జెడ్ పి హెచ్ ఎస్ మాధవాపురం ప్రధానోపాధ్యాయురాలు స్నేహలత గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సమావేశంలో వీరన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధానంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ గారి అధ్యక్షతన 33 జిల్లాల జన జాగరణ యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జూలై 11న మొదలయ్యి 12 వ తారీఖున మహబూబాబాద్ జిల్లాకు వస్తుంది కావున మహబూబాబాద్ జిల్లాలోని సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకన్న గారు, నాగయ్య గారు,పరమాత్మ చారి గారు, బాబిరెడ్డిగారు, సుజాత గారు ,సౌభాగ్యగారు, చంద్రశేఖర్ , హైమావతి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *