బాలుర మరియు బాలికల కళాశాల భవన నిర్మాణానికి 19.10 లక్షల రూపాయల నిధులు మంజూరు
రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు – విద్యకు ప్రభుత్వం పెద్దపీట
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మహా తెలంగాణ/మహబూబాబాద్
మహబూబాబాద్ (మానుకోట) నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలుర, బాలికల కళాశాల భవనాల నిర్మాణానికి రూ.19.10 లక్షల రూపాయల అనుమతులు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ,రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి,ఎంపీ బలరాం నాయక్ చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మానుకోట నియోజకవర్గంలో ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్య, వైద్యం, రహదారులు, తాగునీటి సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అభివృద్ధిలో మహబూబాబాద్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఉదయపు ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన వసతులు, కొత్త భవనాలు, విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు తమ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ గూగులోత్ జ్యోతి రమేష్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గణపురం అంజయ్య,కాంగ్రెస్ పార్టీ స్థానిక కౌన్సిలర్ బోడ రవి, మహబూబాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ లు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,పట్టణ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.