మహాతెలంగాణ/మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా ఎడ్జెర్ల గ్రామంలోని గిరిజన రైతు బాదావత్ వీరన్న – బుజ్జి పొలంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పెసర్లు విత్తనాలు వేసి పంట మార్పిడి విధానాన్ని ప్రారంభించారు. సూపర్ ఎల్నినో ప్రభావం వలన ఈసారి వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందున, రైతులు పంట మార్పిడి విధానం వైపు మల్లాలి, అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రైతులకు విత్తనాలను పంపిణీ చేసి వారిని ఉద్దేశించి పంట మార్పిడి విధానం అందిస్తున్న సబ్సిడీ తదితర అంశాలపై మాట్లాడారు