కాంపల్లి ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

మహా తెలంగాణ/సీరోల్

సీరోల్ మండలం కాంపల్లి ఉన్నత పాఠశాలను మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సత్యనారాయణమూర్తి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రగతి, తరగతి గదుల్లో బోధన–అభ్యసన ప్రక్రియ, మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాల పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
మధ్యాహ్న భోజన పథకం నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వంట ఏజెన్సీ నిర్వాహకులు పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని సూచించారు. పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
అదేవిధంగా PM SHRI పాఠశాలకు వచ్చే నిధులను సక్రమంగా వినియోగిస్తూ విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రీ-ప్రైమరీ తరగతులను పరిశీలించి, విద్యార్థుల అభ్యసనానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్లను పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి వాటిని విద్యార్థుల అభ్యసనానికి సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
అనంతరం ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి, పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని, గుణాత్మకమైన విద్యను అందించాలని సూచించారు. ప్రతి తరగతి గదిలో బోధిస్తున్న అంశానికి అనుగుణంగా TLMలను ప్రదర్శించి, IFB ప్యానళ్లను సమర్థవంతంగా వినియోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించాలని, వారిని జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి తీర్చిదిద్దాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీరోల్ మండల విద్యాశాఖ అధికారి ఇస్లావత్ లచ్చిరాం, సైన్స్ ఆఫీసర్ అప్పారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.
https://mahatelangana.in/38662/

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *