సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి
మహాతెలంగాణ/మరిపెడ:
వంద రోజులలో ధరలు తగ్గిస్తామని ప్రగాల్పాలు పలికిన కేంద్ర బిజెపి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి విమర్శించారు.గురువారం మరిపెడ మండల కేంద్రంలో సిపిఐ ప్రజా చైతన్య యాత్రను సుధాకర్ రెడ్డి ప్రారంభిoచి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించక పోవడం,అసంఘటిత రంగ కార్మికులకు పని భద్రత లేక,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం అమలు,సాక్షాత్తు పార్లమెంటు ఆమోదం పొందిన బయ్యారంలో ఉక్కు పరిశ్రమ,జాతీయ ప్రాజెక్టు హోదా,కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు లాంటి హామీలను అమలు పరచకపోవడం బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని అన్నారు. అదేవిధంగా “మార్పు కావాలి” అనే నినాదంతో సిపిఐ చేపట్టిన సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ,జిల్లా కౌన్సిల్ సభ్యులు అబ్దుల్ రషీద్,అంజి,పాక వెంకన్న, వీరన్న,హనుమంతు,సత్యం,రవీందర్ బద్రు,ఆంగోత్ వెంకన్న,రమేష్, వీరేందర్ నరసయ్య,లింగయ్య,తురక రమేష్, కన్నె వెంకన్న,కలగూర నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.