వర్షాబావ పరిస్థితులలో ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి

డిఏఓ విజయచంద్ర

మహాతెలంగాణ/మరిపెడ

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో వర్షా బావ పరిస్థితుల కారణంగా తక్కువ నీటి వినియోగంతో సాగువయే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని బిఏ ఓ విజయ చంద్ర అన్నారు.గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరిధిలోని మరిపెడ క్లస్టర్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ వైవిద్యం అనే కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ,రైతులు ఎల్నినో ప్రభావం వలన ఏర్పడే వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలైన పెసర,కంది,మినుములు,ఆయిల్ ఫామ్,ఇతర కూరగాయల పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు.ఆరుతడి పంటలు వేసుకోవడం వలన పంట పెట్టుబడి తగ్గి,నిటికొరతను అధిగమించవచ్చు అని అన్నారు.పామాయిల్ పంటను వేసుకోవడం వలన రైతులకు నీటి ఆదాతో పాటు,అధిక ఆదాయం వస్తుందని,అదేవిధంగా కూరగాయ పంటలు వేసుకోవడం వలన ప్రతి రోజు ఆదాయం అర్జించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో మరిపెడ డివిజన్ టెక్నికల్ ఏవో శ్రీదేవి,ఆర్టికల్చర్ హెచ్ఓ శాంతి ప్రియ,ఏఈఓ లు శ్రీకాంత్,అన్వేష్,అశోక్,చారాన్,స్రవంతి,సరిత,రైతులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *