మహా తెలంగాణ/మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పానుగోతు రాంలాల్ ఎన్నికైన సందర్భంగా ఆయనను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి వారినివాసాని కి వెళ్లిన రాం లాల్ కు పుష్పగుచ్చం అందించి,శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి మాట్లాడుతూ…పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పానుగోతు రాంలాల్ ఎన్నిక కావడం అభినందనీయమని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండాలని ఆకాంక్షించారు.పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి మరింత బలోపేతం తీసుకురావాలని సూచించారు.అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడుపానుగోతు రాంలాల్.మాట్లాడుతూ…తనపై నమ్మకం ఉంచి పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు, నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని,నాయకులు,కార్యకర్తలను కలుపుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దబోయినఐలమల్లు,సయ్యద్ సర్వర్ భాయ్,చాపల శ్రీనివాస్ రెడ్డి,నరసింహారెడ్డి,వెంకట్ రెడ్డి,యాదగిరి,సత్తిరెడ్డి, లక్ష్మారెడ్డి,బృహాన్పురం మాజీ సర్పంచ్ లక్ష్మయ్య తదితర కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.