మహా తెలంగాణ/మరిపెడ:
సమాజ సేవలో తమ వంతు కర్తవ్యం గా పేద విద్యార్థులు చదువుకుని ప్రభుత్వ పాఠశాలకు మూడు గ్రీన్ బోర్డులను అందజేయడం సంతోషంగా ఉందని మరిపెడ వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ సభ్యులు అన్నారు.సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలకు మూడు గ్రీన్ బోర్డులను మరిపెడ వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ సభ్యులు అందజేయడంపై పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాగేష్ గర్రెపల్లి( వాసవి క్లబ్ అధ్యక్షులు),మురారిశెట్టి రాజు( ట్రెజరర్),గర్రెపల్లి వెంకన్న (రీజనల్ చైర్మన్),పూర్వ అధ్యక్షులు ఉల్లి శ్రీనివాస్,వంగపల్లి భరత్ కుమార్,వంగవీటి భద్రయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్బూరి సునీల్ కుమార్,ఉపాధ్యాయులు,విద్యార్థులు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.