కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి

మాజీ మంత్రి రెడ్యా నాయక్

మహా తెలంగాణ/మరిపెడ:

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి యధావిధిగా కొనసాగించాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్య నాయక్ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం మరిపెడలో భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ రహదారిపై మహా ధర్నా రాస్తారోకో నిర్వహిస్తున్నామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా తొలగించాలని చూస్తుందని ఇప్పటికే రైతు బీమా ప్రీమియం చెల్లించలేదని ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలకు స్వస్తి పలకాలని చూస్తోందని రైతు రుణాలు రైతుబంధు వంటి పథకాలను అమలు చేయడంలో విఫలం అయిందని అన్నారు. రేవంత్ రెడ్డి కేసులు ఏపించి పథకాలను ఆపాలని చూస్తున్నాడని, హైడ్రా రంగనాథ్ విషయంలో హైకోర్టు తొలగించమని చెబితే,అప్పిలుకు వెళ్లిన ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల విషయంలో కోర్టులో అప్పిలుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు డోర్నకల్ యువ నాయకులు డిఎస్ రవిచంద్ర అయుబ్ పాషా కాలు నాయక్ రఘు శ్రీనివాసరావు లతీఫ్ కౌన్సిలర్లు సర్పంచులు ఉపసర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు ఇతర నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *