జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఆదర్శంగా తీసుకోవాలి

రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి

యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ గొప్ప అవకాశం

మహబూబాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ శిబిరం ప్రారంభం

మహాతెలంగాణ/మహబూబాబాద్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ నియామకాలకు సిద్ధమవుతున్న మహబూబాబాద్ జిల్లా యువతీ యువకులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కానిస్టేబుల్ & ఎస్‌ఐ కోచింగ్ శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.మహబూబాబాద్ ఎంపి పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, చైర్‌పర్సన్ జ్యోతి, జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, ఐఏఎస్, ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలోని యువతకు పోలీస్ ఉద్యోగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎంతో చక్కటి ఉచిత కోచింగ్ అందిస్తున్నారని అన్నారు.భద్రాద్రి జోన్ పరిధిలో కేటాయించిన పోలీస్ ఉద్యోగాల ఖాళీలను ప్రస్తావిస్తూ, మహబూబాబాద్ జిల్లాకు కేటాయించిన పోస్టులను లక్ష్యంగా చేసుకుని అభ్యర్థులు కష్టపడి సిద్ధం కావాలని సూచించారు.మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ సంకల్పంతో ప్రారంభించిన ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమం అభ్యర్థులకు ఎంతో గొప్ప అవకాశమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందని తెలిపారు.అభ్యర్థులు నిరుత్సాహపడకుండా కష్టపడి, అవసరమైతే నిద్రలేని రాత్రులు గడుపుతూ లక్ష్యసాధన కోసం సిద్ధమై ఉద్యోగాలను సాధించాలని పిలుపునిచ్చారు.భాగ్యకిరణ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ పొంది తమలోని ప్రతిభను వెలికితీసి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ప్రతిభ ఉన్న అభ్యర్థులను గుర్తించి వారికి సరైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో యువత పోలీస్ ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ యువత కోసం అనేక నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ప్రభుత్వానీ దన్నారు, భారీగా 562 గ్రూప్ వన్ ఉద్యోగాలు నోటిఫికేషన్లు జారీ చేసి పారదర్శకంగా నియామకాలు జరిపామని తెలిపారు, అలాగే టీచర్స్ మెగా డీఎస్సీ, వైద్య ఆరోగ్యశాఖ తదితర విభాగాలలో ఉద్యోగాల భర్తీ చేయడం జరిగిందన్నారు, జిల్లాలోని యువత ప్రతి ఒక్కరూ కలెక్టర్ ఎస్పీ లను ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో విద్యను అభ్యసించి ముందుకు సాగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు.జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ఉచిత శిక్షణ శిబిరం ఎంతో మంచి అవకాశమని అన్నారు. పోలీస్ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు.పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నాణ్యమైన ఉచిత శిక్షణ అందించేందుకు ముందుగా 1,056 మంది అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్‌కు ఎంపిక చేసి, అందులో 500 మంది అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేసినట్లు ఎస్పీ తెలిపారు.ఎంపికైన 500 మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ప్రత్యేక ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భాగ్యకిరణ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వచ్చే అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.అభ్యర్థులకు శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ మరియు భోజన సదుపాయాలను కూడా ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.స్టడీ మెటీరియల్ పంపిణీఅనంతరం ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ శ్రీ బలరాం నాయక్, ఎమ్మెల్యే శ్రీ మురళి నాయక్, చైర్‌పర్సన్ జ్యోతి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ తదితరుల చేతుల మీదుగా ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, భాగ్యకిరణ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు, ఫ్యాకల్టీ సభ్యులు, శిక్షణకు ఎంపికైన 500 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *