ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
మహా తెలంగాణ దంతాలపల్లి :
పద్మశాలీలు ఐక్యతతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు.మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వేదికలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్,మేకల యాకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనరల్ బాడీ సమావేశానికి ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న పద్మశాలి కుటుంబాల సంక్షేమానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని సమస్యలను సంఘటితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పద్మశాలి యువత విద్య,ఉపాధి రంగాల్లో రాణించాలని,మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.పద్మశాలి సంఘం మరింత బలోపేతం కావడానికి నాయకులు,సభ్యులు సమన్వయంతో పనిచే