మహాతెలంగాణ /మహబూబాబాద్
రిటైర్డ్ హిందీ పండిట్ సీనియర్ టీచర్ ఫాతిమా జోహార బేగం ను రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా ) మహబూబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం గురుపూజోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. మహబూబాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేవా జిల్లా అధ్యక్షులు సంకా బద్రి నారాయణ, గౌరవ అధ్యక్షులు సోమ గోవర్ధన్, ఉపాధ్యక్షులు అంబటి రవీందర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు టి మురళీధర స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవా జిల్లా అధ్యక్షులు సంకా బద్రి నారాయణ మాట్లాడుతూ గురువు… మనుషులను తీర్చిదిద్దే మహోన్నత నిర్మాణకర్త అని కొనియాడారు.సాధారణ గురువు పాఠం చెబుతాడు,మంచి గురువు వివరిస్తాడు,ఉన్నత గురువు చేసి చూపిస్తాడు,కానీ మహోన్నత గురువు మాత్రమే శిష్యుడిలోని అంతర్గత ప్రతిభను తట్టిలేపి, జీవితాన్ని స్వయంగా మలచుకునేలా ప్రేరేపిస్తాడు అని వివరించారు.అందుకే ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు బోధించే వ్యక్తి కాదు… ఒక శిల్పి.అతను నిర్మించేది భవనాలు, వంతెనలు కాదు… మనుషులను!అతను తీర్చిదిద్దేది జీవితాలను… వెలిగించేది రేపటి భవిష్యత్తును. అన్నారు.ఒక సాధారణ దీపం తన చుట్టూ ఉన్న చీకటిని మాత్రమే తొలగిస్తుంది.కానీ ఒక మంచి గురువు వెలిగించే జ్ఞానదీపం తరతరాల అజ్ఞానపు చీకట్లను పారద్రోలుతుంది. అని చెప్పారు. అలాంటి…. గురువులను ఏటేటా గురుపూజోత్సవం సందర్భంగా సన్మానించడం పూర్వజన్మ సుకృతంగా భావించాలన్నారు. గురువులకు ఎంత చేసిన తక్కువేనని చెప్పారు. గురుపూజోత్సవ సందర్భంగా మా గురువు సినియర్ హిందీపండిట్ ఫాతిమా జోహార్ బేగము ని ఘనంగా సన్మానించుకున్నాము..