రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా జెడ్పిహెచ్ఎస్ దాట్ల హెచ్ఎం కృష్ణయ్య ఎంపిక

మహాతెలంగాణ/ మహబూబాబాద్:

జిల్లాలోని దాట్ల జెడ్పిహెచ్ఎస్ హెచ్ఎం కృష్ణయ్య రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం పట్ల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, నాణ్యమైన బోధనతో పాటు పాఠశాల సమగ్ర అభివృద్ధికి శ్రీ కృష్ణయ్య అందించిన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు, ఉపాధ్యాయులను సమన్వయం చేస్తూ పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారు.రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖకు, దాట్ల జెడ్పిహెచ్ఎస్ కు ఎంతో గర్వకారణమని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. కృష్ణయ్య సేవలు ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమని, ఆయనను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈరోజు కొడంగల్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలోఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి. ఎడ్యుకేషన్ సెక్రటరీ. యోగిత రానా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా అవార్డు పొందడం గర్వకారణం ఈ సందర్భంగా శ్రీ కృష్ణయ్య గారికి జిల్లా విద్యాశాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *