మహా తెలంగాణ/మరిపెడ:
మరిపెడ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు 7వ,తారీకు నుండి 12వ,తారీకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు మరిపెడ ప్రాజెక్టు సిడిపిఓ ఎం.ఎల్లమ్మ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం దంతాలపల్లి మండల పరిధిలోని బొడ్లాడా బీసీ 1 ఎస్సి 2 వారు 7వ తారీఖున,మరిపెడ మండలంలోని బాల్య ధర్మారం.2,మాన్సింగ్ తండా,గాలి వారి గూడెం,జామ్లాతండా వారు 8 తారీఖున,మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం -3 నాలుగో వార్డు వారు 9 వ తారీఖున,నెల్లికుదురు మండలం పిర్య తండా,మంచ తండా,వారు 10వ తారీఖున,మరిపెడ మండలం తాళ్లవుకల్ గ్రామ పరిధిలోని చాపలతండ11 వా తారీఖున,నర్సులపేట మండలం కౌసల్య దేవిపెళ్లి గ్రామ పరిధిలోని బీల్యాతండా వారు 11వ తారీకున,నరసింహుల పేట మండలం పరిధిలోని ముదావత్ తండా,పాండ్యా తండా వారు 12వ తారీకున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు,మూడు జిరాక్స్ సేట్లను గెజిటెడ్ సంతకాలతో సకాలంలో హాజరై సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించు కోవాలని కోరారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు రాని అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించబడునని తెలిపారు.