ప్రజా సంక్షమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్

మహా తెలంగాణ/దంతాలపల్లి

నర్సింహులపేట, దంతాలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నా నాటి నుంచి నేటి వరకు ప్రజా ప్రభుత్వ పాలన విజయవంతంగా 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ప్రజా రంజక పాలన అందిస్తూ ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను చేరవేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడుపూగంటి హరికృష్ణ, కొమ్మినేని సతీష్, సర్పంచ్ బాలాజీ, యాదన్న, ఏరుకొండ రమేష్, తండా చిన్న రాములు,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *