అందరికీ ఆదర్శం “దొంతుల మోహన్ “
తాను లేకున్నా… మరొకరి కళ్ళల్లో వెలుగు. ..
తాను లోకాన్ని వీడినా… మరొకరికి దృష్టిని ప్రసరింపచేసిన ధన్యజీవి..
వరంగల్ ఓ సిటీ వాస్తవ్యులైన దొంతుల మోహన్ ( 55) మంగళవారం రాత్రి మరణించినారు.
సమాజహితాన్ని దృష్టిలో ఉంచుకొని,
వారి భార్య పద్మప్రియ, కుమార్తెలు మౌనిక, లిఖిత, అల్లుళ్లు అయితా వంశీకృష్ణ, బచ్చు వంశీకృష్ణ తదితరులు , దొంతుల మోహన్ నేత్రదానానికి సమ్మతించినారు.
L.V.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ , హైదరాబాద్ వారి టెక్నీషియన్ రాజు, దొంతుల మోహన్ నేత్రాలను సేకరించినారు.
దొంతుల మోహన్ తమ నేత్రదానంతో, బంధుమిత్రులకు, తోటివారికి స్ఫూర్తిదాయకంగా నిలిచినారు.