ధరల పెరుగుదలపై ఈ నెల10న కలెక్టరేట్ ఆందోళనకు తరలిరండి

సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి

పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలని కలెక్టరేట్ వద్ద ఈ నెల10న సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు సిపిఐ కొరివి మండలం కౌన్సిల్ సమావేశం పార్టీ కార్యాలయంలో జరగగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల బిజెపి పాలనా వైఫల్యం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ దరలు అడ్డు అదుపు లేకుండా పెరిగాయని, కార్పొరేట్ కంపెనీలకు వేలకోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ సామాన్యుడిపై విపరితమైన ధరల పెరుగుదలతో మోయలేని పెనుభారాన్ని మోపుతూ మోదీ గారడి మాటలతో ప్రజలను ధగా చేస్తూ పాలన సాగిస్తున్నాడని, ప్రజల ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ పేదరికం, నిరుద్యోగం మునుపెన్నడూ లేని విధంగా పెరిగినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని, ధరల పెరుగుదలతో సామాన్యుడునీ లూటీ చేస్తున్న బిజెపి దివాలకోరు పాలనపై ప్రజలు నిరసన ఆందోళన కార్యక్రమాలతో తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు బుడమ వెంకన్న,టౌన్ కార్యదర్శి తురక రమేష్, దూదికట్ల సారయ్య, కన్నె వెంకన్న,రమేష్ బాబు, కలగూర నాగరాజు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *