అమరవీరులకు ఉత్తరాధికారుల చే ఘన నివాళులు

మహాతెలంగాణ/మహబూబాబాద్ :

దేశం స్వాతంత్రం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను విడిచిన అమరవీరులకు స్వాతంత్ర సమరయోధుల వారసులచే ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర సేనాని ఉత్తరాధికారి పరివార సమితి(రిజి) హరిద్వార్ వారు ప్రతి నెల మొదటి ఆదివారం ఉదయం 10 గంటల పది నిమిషాలకు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని, ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ ఆవరణంలోని జాతిపిత మాత్మ గాంధీ విగ్రహమునకు స్వాతంత్ర సమరయోధుల వారసుల లీగల్ అడ్వైజర్ బి. రవీంద్ర గుప్త పూలమాలవేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లో ఆయా జిల్లా కేంద్రాలలో ప్రతినెల మొదటి ఆదివారం ఉదయం 10గంటల 10 నిమిషాలకు అమరవీరుల కు నివాళులు అర్పించాలని స్వాతంత్ర సేనాని ఉత్తరాధికారి పరివార సమితి (రి జి) హరిద్వార్, నేత రఘు వంశీ ఇచ్చిన పిలుపుమేరకు ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను జాతీయ కుటుంబాలుగా గుర్తించి, ప్రభుత్వపరంగా వారసులందరికీ రాయితీలను కల్పించి, అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుతూ త్వరలో జాతీయస్థాయిలో స్వాతంత్ర సమరయోధుల మరియు వారసుల సమ్మేళనంలో అన్ని విషయాలు చర్చించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి నెల జరుగు ఈ కార్యక్రమాన్ని సమరయోధులు మరియు వారసులు జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల వారసుల రాష్ట్ర ప్రతినిధి సింగు రమేష్, వారసులు చీదురాల శరత్, చిలక పల్లి ముత్తిలింగం, చీదిరాల జ్ఞానేశ్వర్, పి. ఆర్ నాగేందర్, భీష్మాచారి, శివరాత్రి వెంకన్న, టేకుల మహేష్ రెడ్డి, గార్లపాటి ఉపేందర్ రెడ్డి, ఐలు రమేష్, సత్యనారాయణ, యాకాంత చారి, సతీష్, అన్నబత్తుల కళ్యాణి, జిన్న కిరణ్, సత్యనారాయణ, తనుజ, జైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *