జి ఈ సి ఓ యద్దనపూడి గాయత్రి
మహాతెలంగాణ/ మహబూబాబాద్ :
బాలికలు విద్యా విద్యావంతులు గా ఎదగాలని అది మనందరి బాధ్యతని మహబూబాబాద్ జిఇసిఓ యద్దనపూడి గాయత్రి,పెదవంగర ఎంఈఓ బుధారపు శ్రీనివాస్ అన్నారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఎస్ఓ జి స్రవంతి అధ్యక్షతన బడిబాట లో భాగంగా గురువారం సమగ్ర విద్యా దినోత్సవం (ఇంక్లూసివ్ విద్య ) కార్యక్రమం జరిగింది. తొలుత సరస్వతీ దేవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ సమగ్ర విద్యార్థి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు కూడా నమోదు చేయించాలని వారికి కూడా అందరితో సమానంగా విద్య అందేలా చూడవలసిన భాద్యత మనపై ఉందని, అదే ఇంక్లూసివ్ విద్య ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ప్రతీ చిన్నారికి నాణ్యమైన విద్యతో పాటు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. కస్తూర్బా బాలికల విద్యాలయం లో ప్రభుత్వం ఇంటిని మైమర్పించే విధంగా సకల సౌకర్యాలు, అర్హత అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాభోదన కల్పిస్తోందని వాటిని సద్వినియోగపర్చుకుని విద్యార్థినులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు విద్యార్థినులకు సూచించారు. పాఠశాలలో ప్రత్యేక కె స్టడీగా తీసుకొని క్రానిక్ స్టేజిలో కూడా విద్యార్థిని అలేఖ్య లో మనోధైర్యం కల్పించి పదో తరగతిలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థిని గురించి ఎస్ఓ స్రవంతి వివరించారు, ఆమెను జి ఈ సీ ఓ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థిని మనోధైర్యంతో ముందుకు సాగాలని, ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనేలా విద్యార్థినుల్లో ధైర్యం పెంపొందాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు స్వాగత నృత్యంతో పలువురుని అలరించారు. ఈ కార్యక్రమంలో సి ఆర్ టి లు సైదమ్మ, కళ్యాణి, సరిత, పి కళ్యాణి సత్యవతి, కవిత, విజయలక్ష్మి, మమత, హరిత తదితరులు పాల్గొన్నారు.