గ్రామాభివృద్ధిలో ప్రజలందరి సహకారం అవసరం..
సర్పంచ్ గుగులోత్ సరోజ నరేందర్ నాయక్..
వివో బిల్డింగ్ స్లాబ్ పనులు ప్రారంభించిన సర్పంచ్..
మహా తెలంగాణ/మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లచ్యతండా గ్రామ పంచాయతీలో గ్రామాభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో నిర్మిస్తున్న వివో బిల్డింగ్ స్లాబ్ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ గుగులోత్ సరోజ నరేందర్ నాయక్ శనివారం కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సరోజ నరేందర్ నాయక్ మాట్లాడుతూ..లచ్యతండాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.గ్రామ అవసరాలకు అనుగుణంగా చేపడుతున్న ప్రతి నిర్మాణ పనిని నాణ్యతతో,పారదర్శకంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.వివో బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన అనంతరం గ్రామంలో సమావేశాలు,అంగన్వాడీ కార్యక్రమాలు,సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు మరింత సౌకర్యం కల్పించబడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్, అంగన్ వాడి బిల్డింగ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.గ్రామాభివృద్ధిలో ప్రజలందరి సహకారం అవసరమని సర్పంచ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాలు,గ్రామ పంచాయతీ కార్యదర్శి గడ్డం హారిక,అంగన్వాడీ సూపర్వైజర్ షకీరా,వార్డు సభ్యుడు లక్ష్మణ్,బాగి కవిత,రవి,గ్రామపంచాయతీ పెద్దలు భగవాన్,సాగర్,కిషన్,మంగీలాల్,వెంకన్న,పర్సు,శంకర్,అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.