మహా తెలంగాణ/మరిపెడ
మరిపెడ మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసా పత్రాలు లభించాయి.80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలనుపురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో మరిపెడ తాసిల్దార్ కృష్ణవేణి,ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,మరిపెడ మున్సిపాలిటీ ఇన్చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ షేక్ యాకుబ్ పాషా,కంప్యూటర్ ఆపరేటర్ అశోక్ రెడ్డిలను ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసి ప్రశంసా పత్రాలతో సత్కరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,ఎస్పీ శబరీష్ చేతుల మీదుగా వారు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.విధి నిర్వహణలో అంకితభావం,బాధ్యతాయుతసేవలుఅందించినందుకు ఈ గుర్తింపు లభించింది.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలను అధికారులు,సిబ్బంది, ప్రజాప్రతినిధులు అభినందించారు.