మహాతెలంగాణ/మరిపెడ:
జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకుని మరిపెడతో పాటు జిల్లా ఖ్యాతిని మరింత పెంచిన ప్రముఖ ఆర్ట్ ఫోటోగ్రాఫర్ ఫక్రుద్దీన్‌ను ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మరిపెడ జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఆయనకు పూల బొకే అందజేసి,శాలువాతో సత్కరించారు.ఫోటోగ్రఫీ రంగంలో ఫక్రుద్దీన్ సాధించిన విజయాలను అభినందించారు.భవిష్యత్తులో మరెన్నో జాతీయ,అంతర్జాతీయ అవార్డులు,రివార్డులు అందుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు జిన్న లచ్చయ్య,షేక్ సత్తార్ పాషా,మహమ్మద్ రియాజ్, పసునూటి వేణు,అక్తర్ పాషా,మచ్చ రాజేష్,పోతుల గోవర్ధన్,బోడపట్ల వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.