కేసముద్రం పాలిటెక్నిక్ విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

AISF మహబూబాద్ జిల్లా కార్యదర్శి వెలుగు శ్రావణ్ కుమార్

మహాతెలంగాణ/మహబూబాబాద్:

పాలిటెక్నిక్ విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ (ఏఐఎస్ఎఫ్) AISF ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ సెంటర్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెలుగు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలని పాలిటెక్నిక్ ను టెక్నికల్ ఎడ్యుకేషన్ గా కొనసాగించాలని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చేర్చ వద్దని లాటరల్ ఎంట్రీ విధానాన్ని కొనసాగించాలని రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో భాగంగా నిన్న కేసముద్రం పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తుండగా పోలీసులు వారిపై అనాగరికంగా వ్యవహరించారని, ఇది సమంజసం కాదని వెంటనే విచారణ జరిపి నిజనిర్ధారణ చేసి సంబంధిత అధికారులపై శాఖ పర్యమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్(AISF )అండగా ఉంటుందని వారు తెలియజేశారు ,తక్షణమే ప్రభుత్వం విద్యార్థులు చేసినటువంటి న్యాయమైన డిమాండ్లను పరిశీలించి పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మేక వెంకటేష్, పట్టణ కార్యదర్శి చిలివేరి వికాస్, యువజన నాయకులు జలగం ప్రవీణ్, సాయి, వరుణ్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *