జాబ్ మేళ లో ఎంపికైన వారికి నియామక పత్రాలు

మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో శ్రీ రైతు మిత్ర ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహబూబాబాద్ కంపెనీలో ఉద్యోగవకాశాలను కల్పించుటకు తేది: 02.07.2025 న నిర్వహించిన జాబ్ మేళాలో (52) మంది అభ్యర్థులు పాల్గొనగా అందులో (23) మంది ఎంపికయ్యార ని జిల్లా ఉపాధి అధికారి శ్రీమతి టి.రజిత తెలిపారు. ఎంపికైన అభ్యర్దులకు మంగళవారం కలెక్టరేట్ లోని జిల్లా ఉపాధి శాఖ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల శాఖ, జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ ముఖ్య అతిదిగా విచ్చేసి నియామక పత్రాలను అందజేశారు. శ్రీ రైతు మిత్ర ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహబూబాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఎంపికైన వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కంపెని జిల్లా మేనేజర్ మమత, జిల్లా ఉపాధి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *