గిరిజన జర్నలిస్ట్ లు ఐక్యత అభినందనియం
డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, డిఎంహెచ్ఓ రవి రాథోడ్, సివిల్ సప్లై డిఎం కృష్ణ వేణి
మహబూబాబాద్ పట్టణ కేంద్రం లో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TWJA ) జిల్లా ద్వితీయ మహాసభ నిర్వహిస్తున్న సందర్బంగా శనివారం జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ లో డీపీఆర్ఓ రాజేంద్ర ప్రసాద్, జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్, సివిల్ సప్లై డిఎం కృష్ణ వేణి లు మహాసభ ల కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జర్నలిజం సమాజం పట్ల మరింత విశ్వాసం పెంచాలని అన్నారు.ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ద్వితీయ మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తేజవత్ రవి నాయక్, మహాసభ ఆహ్వాన సంఘం కన్వీనర్ బానోత్ లక్ష్మణ్ నాయక్, నాయకులు , గుగులోత్ శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర నాయకులు బానోత్ నరసింహ నాయక్, జిల్లా నాయకులు మహేందర్ నాయక్, భూక్య మోహన్,తేజవత్ శ్రీనివాస్ నాయక్,బోడ శ్రీనివాస్ నాయక్, బోడ గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు