ఇద్దరు చైన్ స్నాచర్లనుఒక గంటలో పట్టుకొనిచేదించిన మహబూబాద్ పోలీసులు


ప్రజల సహకారంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు చైన్ స్నాచర్లను ఒక గంటలో పట్టుకొని కేసును చేదించిన మహబూబాద్ జిల్లా పోలీసులు

ప్రెస్ మీట్ లో నిందితుల వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకాన్ ఐపిఎస్ గారు
నిందితుల వివరాలు:

  1. వికాస్ కుమార్, S/o జోగేంద్ర సింగ్, వయసు 26 సంవత్సరాలు, రాజపుత్ కులం, వెల్డింగ్ వర్కర్, R/o లక్ష్మణ్‌పూర్, షామిలి జిల్లా, ఉత్తరప్రదేశ్.
  2. శుభం కుమార్, S/o సోను, వయసు 19 సంవత్సరాలు, రాజపుత్ కులం, బార్బర్ వృత్తి, R/o షామిలి జిల్లా, ఉత్తరప్రదేశ్.

వికాస్ కుమార్ గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పలు దొంగతనాలు, దోపిడీలు, హత్యాయత్నం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం వంటి దాదాపు 8 నేరాలలో నిందితుడిగా ఉండి జైలు శిక్ష అనుభవించాడు.
కాగా వీరిద్దరూ మామా అల్లుళ్లు అని తెలిసింది.

నేర ఘటన వివరాలు: 08.08.2025న వికాస్ కుమార్, శుభం కుమార్‌లిద్దరూ దక్షిణ భారతదేశానికి (తెలుగు రాష్ట్రాలకు) వచ్చి దొంగతనాలు, దోపిడీలు చేసి అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో షామిలి నుండి ఢిల్లీ చేరుకుని, అక్కడి నుండి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో 09.08.2025 రాత్రి విజయవాడకు చేరుకున్నారు.

10.08.2025న ఖమ్మం చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో రెక్కీ చేసి, తెల్లవారుజామున పార్క్ చేసి ఉన్న పల్సర్ బైక్ (TS04 FB0862) దొంగిలించారు. అనంతరం ఖమ్మం నుండి తొర్రూర్ వైపు బయలుదేరి, ఉదయం సుమారు 7:30 గంటలకు మాటేడు గ్రామానికి చెందిన ముత్యం ప్రేమలీల (వయసు 55) అనే మహిళను కత్తితో బెదిరించి, చెంపపై కొట్టి, ఆమె మెడలోని సుమారు 3 తులాల బంగారు గొలుసు లాక్కొన్నారు.

పట్టుబడిన విధానం: విషయం తెలుసుకున్న దంతాలపల్లి బ్లూ కోల్ట్ కానిస్టేబుళ్లు ఆకుల గణేష్ (PC No.05), కే. లోకేష్ (PC No.55) వెంటాడగా, మద్దిరాల పోలీస్ స్టేషన్ పరిధిలో వేములపల్లి వైపు పారిపోతుండగా దంతాలపల్లి ఎస్సై పి. రాజు గారు, గ్రామస్తులు మల్లం లింగయ్య, పాక సాయి, పాక ఉదయ్, బిక్షపతి లకు సమాచారం అందించారు.

ఇంతలో తొర్రూర్ ఎస్సై ఉపేందర్, దంతాలపల్లి ఎస్సై రాజు మరియు గ్రామస్తులు కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రికవరీ వివరాలు:

దొంగిలించిన పల్సర్ బైక్ – TS04 FB0862 , 27 గ్రాముల బంగారు గొలుసు

ఎస్పీ ప్రశంసలు:
నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన బ్లూ కోల్ట్ కానిస్టేబుళ్లు గణేష్, లోకేష్, ఎస్సై తొర్రూర్ ఉపేందర్ , సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్, డీఎస్పీ క్రిష్ణ కిషోర్ , ఎస్సై దంతాలపల్లి రాజు మరియు సహకరించిన గ్రామస్తులను జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకాన్ గారు శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందించి వారికి కొంత నగదు ప్రోత్సాహం అందించారు,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, నెల్లికుడూరు ఎస్ఐ రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *