ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజయోగిని బ్రహ్మకుమారి సుజాత మానుకోట శాఖ వారి ఆధ్వర్యంలో విశ్రాంత ఉపాధ్యాయులకు మరియు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్ ల కు ఆశ్రమం నందు ఘనంగా సన్మానం నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట శాఖ నిర్వాహకులు రాజయోగిని బ్రహ్మకుమారి శివ జ్యోతి గారు, రిటైర్డ్ డిప్యూటీ ఈ వో గసికంటి నారాయణగారు, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నాగేందర్ గారు, నెల్లికుదురు రిటైర్డ్ ఎం ఈ ఓ కే ప్రభాకర్ గారు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని విశ్రాంత ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయులకు మరియు స్థానిక ప్రైవేట్ పాఠశాలలు పానిని , కృష్ణవేణి, ఏకశిలా ఏంజెల్స్, రత్న ఫోకస్, శ్రీ చైతన్య, హోలీ వర్డ్స్ ఉన్నత పాఠశాలల కరస్పాండెంట్లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో దేవి, సుజాత, గణేష్, యుగంధర్, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
07
Sep